Gaurav Bhatia : కాంగ్రెస్ నేతలు చట్టానికి అతీతం కాదు
పవన్ ఖేరా అరెస్ట్ పై భారతీయ జనతా పార్టీ
Gaurav Bhatia Khera Arrest : కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. చట్టం ముందు అంతా సమానులేనని, ఎవరైనా ఒక్కటేనని పేర్కొంది. దూషణలు, ఆరోపణలు, విమర్శలకు కూడా హద్దు అనేది ఉంటుందని దానిని అతిక్రమిస్తే ఎవరైనా శిక్షకు అర్హులు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
ఏం చేసినా చట్ట బద్దంగానే జరుగుతుందని , తాము చట్టానికి అతీతులమన్న అపోహలో కాంగ్రెస్ నేతలు జీవించ వద్దంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆయన కుటుంబ సభ్యులపై కించ పరిచే పదాలు వాడడం మంచి పద్దతి కాదన్నారు. ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు గౌరవ్ భాటియా(Gaurav Bhatia Khera Arrest).
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నిరసన తెలియ చేయడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు బీజేపీ నాయకుడు. దేశంలోని 140 కోట్ల మందికి పైగా ప్రజల ఆశీర్వాదం ప్రధానమంత్రి పొందుతున్నారని , ఆయనను దుర్బాష లాడడం కాంగ్రెస్ పతనానికి గొయ్యి తవ్వుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీపై నానా దుర్భాష లాడటం ఎవరు భరిస్తారంటూ ప్రశ్నించారు గౌరవ్ భాటియా(Gaurav Bhatia). వ్యాపారవేత్త నీరవ్ మోడీని కూడా మోదీకి ఆపాదిస్తే ఎలా అని మండిపడ్డారు.
Also Read : అరెస్ట్ ఎమర్జెన్సీ కంటే దారుణం – సీఎం