Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

జూబ్లీహిల్స్‌ లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేయాలని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కంచర్ల అశోక్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్‌ కంజర్ల శ్రీనివాస్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి దూడల రవిగౌడ్‌, సికింద్రాబాద్‌ జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్‌ మహ్మద్‌ మోసిన్‌ ఖురేషి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ సర్దార్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర కృష్ణ కుమార్‌, నాయకులు భిక్షపతి, నర్సింగ్‌రావు, మహ్మద్‌ ఖాజా పాషా పాల్గొన్నారు.

Jubilee Hills By Election – జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేయను – కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్‌ స్వామి

త్వరలో జరిగే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో (Jubilee Hills By Election) కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ నాయకుడు సి.ఎ.వేణుగోపాల్‌ స్వామి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా పది వేల మెజార్టీతో గెలిపిస్తామని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీఉంటుందని పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో తాను సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం టిక్కెట్‌ అడిగిన విషయం వాస్తవమే అని కాని అధిష్టానం తనకు ఇవ్వలేదని దానం నాగేందర్‌కు ఇచ్చిందన్నారు.

ఆయన కోసం తాను పనిచేశానని కాని ఓడిపోయామని గుర్తుచేశారు. ఇటీవల కొంతమంది తన అభిమానులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్‌ టిక్కెట్‌ తనకు ఇవ్వాలని బ్యానర్‌లు ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని సదరు బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారో కూడా తనకు తెలియదన్నారు. జూబ్లీహిల్స్‌ టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే 10 మంది వరకు ఆశిస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్‌ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

Also Read : Rahul Gandhi: ‘ఓటు చోరీ’పై ఇండియా కూటమితో కాంగ్రెస్ పోరుబాట

Leave A Reply

Your Email Id will not be published!