Yashwant Sinha : సిన్హాతో భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా
మధ్య ప్రదేశ్ లో విపక్షాలకు బిగ్ షాక్
Yashwant Sinha : దేశంలో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పదవికి కీలకమైన ఎన్నిక ఈనెల 18న జరగనుంది. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.
ఇక బీజేపీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉన్నారు. అయితే ఓట్ల పరంగా చూస్తే విపక్షాలకే ఎక్కువ ఓట్లు ఉన్నాయి.
కానీ మోదీ త్రయం నయానో భయానో తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు చీలి పోతున్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఎలాగైనా సరే రాష్ట్రపతి పదవి తమకే వస్తే ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారు చేయొచ్చని మోదీ ప్లాన్.
ఇప్పటికే దేశాన్ని అప్పుల పాలు చేసి , ఉన్నత ప్రభుత్వ సంస్థలను అమ్మేసి కేవలం వ్యాపారవేత్తల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్న కేంద్ర సర్కార్ తీరును ఎండగట్టాలని పిలుపునిస్తున్నారు యశ్వంత్ సిన్హా(Yashwant Sinha).
రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ కాదని రాజ్యాంగానికి సేఫ్ గార్డ్ అని గుర్తు పెట్టుకోవాలని పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒడిశాలో పర్యటించారు.
మధ్య ప్రదేశ్ లో కూడా పర్యటించిన సమయంలో ఆసక్తికకర పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హా నిర్వహించిన మీటింగ్ డుమ్మా కొట్టారు.
వీరిలో రాష్ట్ర మాజీ మంత్రులు , సీనియర్ నేతలు జితూ పట్వారీ, తరుణ్ భానోత్ , ఆరిఫ్ అక్వీల్ , సంజయ్ యాదవ్ ఉన్నారు.
Also Read : రాజ్ ఠాక్రేతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ