Congress MLCs : కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు
మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ కు బిగ్ ఛాన్స్
Congress MLCs : కర్ణాటకలో శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి మంగళవారం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. వారికి నామినేషన్ పత్రాలను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అందజేశారు. ఎమ్మెల్సీలుగా దరఖాస్తు చేసిన వారిలో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ , ఎన్ఎస్ బోస రాజు , తిప్పన్న కమకనూర్ పార్టీ నుంచి ఉన్నారు. ఈ సందర్బంగా పోటీ చేస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం, డిప్యూటీ సీఎం.
ఇదిలా ఉండగా కర్ణాటకలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీలో ముందు నుంచీ ఉంటూ వచ్చిన, అపారమైన అనుభవం కలిగిన నాయకులకు మొండి చేయి చూపించింది హై కమాండ్. దీంతో కొందరు నేతలు బీజేపీని వీడారు. వారిలో అతి ముఖ్య నాయకుడు , మాజీ సీఎంగా పని చేసిన జగదీశ్ షెట్టర్. ఆయన కాంగ్రెస్(Congress) పార్టీకి బలమైన నాయకుడిగా మారారు. ఛాలెంజ్ చేసి గెలిపించారు.
ఆయన చేరిక సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గట్టి హామీని కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే జగదీశ్ షెట్టర్ కు ఎమ్మెల్సీ పదవి దక్కనుంది.ఎందుకంటే 135 సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది. మరో వైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా షెట్టర్ ను నియమించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read : AP Students YS Jagan : జగన్ కు స్టూడెంట్స్ జేజేలు