Congress Party : బీసీలకు 12 సీట్లు జనరల్ 26 సీట్లు
మైనార్టీలకు 3 సీట్లు కేటాయింపు
Congress Party : ఢిల్లీ – ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్కంఠకు తెర దించుతూ అర్ధరాత్రి 119 సీట్లకు గాను తొలి జాబితా కింద 55 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. కొత్తగా పార్టీలోకి(Congress Party) జంప్ అయిన వారికి 20 మందికి సీట్లు ఇచ్చింది పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ.
Congress Party Updates
ఈ 55 సీట్లకు గాను ఆయా సామాజిక వర్గాలకు ప్రయారిటీ ఇచ్చింది. బీసీలకు 12 సీట్లు, జనరల్ కేటగిరి కింద 26 సీట్లు, మైనార్టీలకు 3 సీట్లు కేటాయించింది. ఇందులో 17 మంది రెడ్లకు సీట్లను ఇచ్చింది. ఈ సందర్బంగా మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై తీవ్రంగా స్పందించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
టికెట్లు రాని వాళ్లు నిరాశకు గురి కావద్దంటూ కోరారు. నామినేటెడ్ పదవులతో పాటు ఎన్నో పోస్టులు ఉన్నాయని స్పష్టం చేశారు. టికెట్స్ రాని వాళ్లు వచ్చిన వాళ్లతో కలిసి పని చేయాలని సూచించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
మన ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమని పేర్కొన్నారు. అందు కోసం అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పొన్నాల పార్టీ మారడం బాధాకరమని ఆవేదన చెందారు. పోతూ పోతూ పార్టీపై అభాండాలు వేయడం దారుణమన్నారు.
Also Read : CM KCR : ఎమ్మెల్యేలపై కన్నెర్ర నోరు జాగ్రత్త – కేసీఆర్
