Congress Slams : మధ్యప్రదేశ్ లో గిరిజనులపై దాడులు
ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ
Congress Slams : మధ్య ప్రదేశంలో ఓ గిరిజనుడిపై మూత్రం పోసిన ఘటన కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బుధవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీ పవర్ లోకి వచ్చాక గిరిజనులు, బహుజనులపై దాడులు మరింతగా పెరిగాయని ఆరోపించింది. 2019లో 1,922 కేసులు నమోదయ్యయాని పేర్కొంది. ఇక 2020లో 2,401 కేసులు, 2021లో 2, 627 కేసులు నమోదైనట్లు తెలిపింది.
దీన్ని బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ కొలువు తీరిన మధ్య ప్రదేశ్ లో గిరిజనులపై దారుణాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఈ గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుందని స్పష్టం చేసింది కాంగ్రెస్(Congress) పార్టీ. అన్ని అడ్డంకులు దాటిన తర్వాత నమోదైన కేసులే ఇన్ని ఉంటే ఇక పోలీసులకు భయపడి నమోదు చేసిన కేసులు ఇంకెన్ని ఉన్నాయోనన్న అనుమానం వ్యక్తం చేసింది.
తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు చేసిన పనికి యావత్ ప్రపంచం తల దించుకుంది. గిరిజన యువకుడిపై అతడు చేసిన చర్యకు సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. అతడిని గుర్తించి అరెస్ట్ చేసినా తగిన రీతిలో శిక్ష పడుతుందని తాము అనుకోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : TTD EO : లోక కళ్యాణం కోసం చతుర్వేద హవనం