Congress Slams : మణిపూర్ లో హింస ఇంకెంత కాలం
ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్
Congress Slams : కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ లో ఇంకెంత కాలం హింస కొనసాగాలని ప్రశ్నించింది. ఇప్పటి వరకు జాతుల మధ్య నెలకొన్న వైరం ఏకంగా 100 మందికి పైగా చని పోయారని తెలిపింది. 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది. 50 రోజుల పాటు హింస కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా మణిపూర్ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయలేక పోతోందని ప్రశ్నించింది.
ఓ వైపు మణిపూర్ మండుతున్నా ప్రధాని ఎందుకు స్పందించ లేదని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ(Congress). ఈ దేశ ప్రజలు ఆదుకోవాలని కోరుతున్నా ఎందుకు మౌనం వహించారో చెప్ఆపలని డిమాండ్ చేసింది. ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని మండిపడింది. ఆనాడు రాజధర్మం పాటించాలని దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి నరేంద్ర మోదీకి బోధించినా పట్టించు కోలేదని ఆరోపించింది.
మణిపూర్ నేటి దాకా మండుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు ప్రధానమంత్రి , హోం శాఖ మంత్రి అమిత్ షా ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడం నేరం చేసినట్లేనని పేర్కొన్నారు.
Also Read : PM Modi Visit : అమెరికాకు చేరుకున్న మోదీ
