Kaustav Bagchi : కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కౌస్తవ్ బాగ్చీ అరెస్ట్
సీఎం మమతా బెనర్జీపై సీరియస్ కామెంట్స్
Kaustav Bagchi Arrest : పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కౌస్తవ్ బాగ్చీని(Kaustav Bagchi Arrest) శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం తన నివాసంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు చీఫ్ వెల్లడించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బర్దోల్లా పోలీస్ స్టేషన్ లో కౌస్తవ్ బాగ్చి పై ఫిర్యాదు నమోదైంది.
పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా లోని బారక్ పూర్ లోని బాగ్చి నివాసంపై దాడి చేయడం కలకలం రేపింది. బర్దోల్లా పోలీస్ స్టేషన్ కు చెందిన భారీ బృందం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి..అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ సీరియస్ గా స్పందించింది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, తమ నాయకుడిని అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
గత కొంత కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సీఎం మమతా బెనర్జీని, ఆమె సాగిస్తున్న పాలనను టార్గెట్ చేస్తూ వస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందంటూ ఆరోపించింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ తనను ప్రశ్నించకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తోందంటూ సీఎంపై మండిపడింది. దీనిపై స్పోక్స్ పర్సన్(Kaustav Bagchi) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీంతో ఆయన ప్రభుత్వానికి టార్గెట్ గా మారారు.
Also Read : సిసోడియా బెయిల్ పై విచారణ