YS Jagan : ప్రజలతోనే అనుబంధం విజయం తథ్యం – జగన్
ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు
YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తాము ఎవరితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. ఆ అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
బుధవారం మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో విద్యా దీవెన పథకం కింద నాల్గో విడత కింద విద్యార్థుల పేరెంట్స్ ఖాతాల్లో రూ. 694 కోట్లు జమ చేశారు సీఎం జగన్ రెడ్డి(YS Jagan).
ఈ స్కీం కింద రాష్ట్రంలో డిగ్రీ, పీజీ చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మున్నూరు కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రూ. 12, 401 కోట్లు విడుదల చేశారు సీఎం.
ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రసంగించారు. పొత్తులు పెట్టుకుంటామంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. చేతి కాని వాళ్లే ఇతరులతో పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ఏకి పారేశారు. చిల్లర రాజకీయాలు చేసే వారిని తాను పట్టంచు కోనన్నారు.
తాను ఏది చేయాలని అనుకుంటానో దానినే అమలు చేస్తానని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఏ పార్టీతోనూ సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు. ప్రజలతోనే తాము అనుబంధం కలిగి ఉంటామన్నారు. వారికి ఏం కావాలో తమకు తెలుసన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశానికే ఆదర్శంగా తమ రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు. కొందరు నాయకులు ఎవరో రాసి ఇస్తున్న స్క్రిప్టులు చదివి అవాకులు చెవాకులు పేలుతున్నారని వారికి అంత సీన్ లేదన్నారు సీఎం.
Also Read : అలుపెరుగని ‘అన్నదాత’కు సెలవు