Putin Zelensky : యుద్ధంలో కన్నీరు తప్ప పన్నీరంటూ ఉండదు. ఓడి పోవటమో లేదా గెలవడమో మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఎందరు న నేల రాలినా ఎవరూ పట్టించుకోరు.
ఎందుకంటే యుద్దం ద్వారానే గెలుపు సాధ్యమవుతుందని నమ్మిన వాళ్లే ఎక్కువ ఈ ప్రపంచంలో. యావత్ చరిత్రను పరిశీలిస్తే రాజ్యాల కోసం కొట్లాడుకున్నారు. చంపుకున్నారు.
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం. బలీయమైన రాజ్యకాంక్షతో తనకు ఎదురు లేదని భావిస్తున్న రష్యా చీఫ పుతిన్ కూడా అలాంటి నియంత కిందకు వస్తారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా యావత్ ప్రపంచం ఒకే తాటిపై వచ్చింది. ఉక్రెయిన్ పై ఏకపక్షంగా దాడులు ఆపాలని కోరింది. కానీ వారి ఆవేదనను అర్థం చేసుకోలేదు.
పుతిన్ తో భేటీ అయ్యాక కొద్ది సేపటికే యుద్ధం ప్రకటించాడు పుతిన్(Putin Zelensky ). అంతటి రక్త పిపాసి. చూస్తే సౌమ్యంగా, అమాయకంగా కనిపిస్తాడు కానీ. మేక వన్నె పులి. ఎప్పుడు ఎవరిపై ఎలా విరుచుకు పడతాడో చెప్పలేం.
కానీ ఆ మౌనం వెనుక, ఆ తీక్షణమైన చూపు వెనుకా, నవ్వు వెనుక ఎడతెగని ఆలోచనలు ఉంటాయి. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే ఇంకెవ్వరికీ వినడు. అదీ పుతిన్ మనస్తత్వం.
ఓ వైపు ఉక్రెయిన్ తో యుద్దం చేస్తూనే మరో వైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెస్కీని మట్టు బెట్టాలని చూస్తున్నాడు. పుతిన్ మామూలోడు కాదు.
అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు అమెరికాను సైతం లెక్క చేయడం లేదు. అవసరమైతే వార్ కు రెడీ అంటున్నాడు.
Also Read : యుద్దం దారుణం అమానవీయం – పోప్