Constable Yashoda Das: ఒడిశా జైలులో కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

ఒడిశా జైలులో కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

Constable Yashoda Das : ఒడిశాలో బాలాసోర్ లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పోలీసు బ్యారక్‌ లోపల మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని యశోద దాస్‌ గా గుర్తించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Constable Yashoda Das Death

రెముణా పోలీస్‌ ఠాణా పరిధిలోని మందొర్‌పూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ యశోద(Constable Yashoda Das)… బాలాసోర్‌ లో విధులు నిర్వహిస్తోంది. అయితే బాలాసోర్‌ జిల్లా పోలీసు బ్యారక్‌ లోపలి ప్రాంగణంలో మంగళవారం యశోద వేలాడుతూ ఉండటాన్ని తోటి కానిస్టేబుళ్లు గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ… అక్కడికి చేరుకునే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే కానిస్టేబుల్ యశోద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా మృతురాలి సోదరుడు టుటు దాస్‌ మాట్లాడుతూ … ‘పోలీసులు ఆమె ఫోన్‌, చాట్‌ వివరాలను పరిశీలించాలని అభ్యర్థించాడు. తన సోదరితో సంబంధం ఉన్న వారి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భోరుమన్నాడు. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. బాలాసోర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని… ప్రాధమిక విచారణలో ఆమె మృతికి వ్యక్తిగత సమస్యలు కారణం కావచ్చని సూచిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు.

Also Read : Waqf Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’

Leave A Reply

Your Email Id will not be published!