Consumer Court of India: హనీమూన్‌ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !

హనీమూన్‌ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !

Consumer Court of India : హనీమూన్‌కి వెళ్లిన వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు చెన్నై వినియోగదారుల కమిషన్‌ రూ.1.60 కోట్ల భారీ జరిమానా విధించింది. డాక్టర్‌ విభూష్ణియా, డాక్టర్‌ లోకేశ్వరన్‌కు 2023 జూన్‌లో వివాహమైంది. జీటీ హాలిడేస్‌ సంస్థ ఏర్పాట్లతో ఆ దంపతులు హనీమూన్‌కు ఇండోనేసియా వెళ్లారు. అక్కడి సముద్రంలో మోటారు బోట్‌లో వారిద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి, చనిపోయారు.

Consumer Court of India Shocking

దీనిపై చెన్నై పూందమల్లి సమీప చెన్నీర్‌ కుప్పంకు చెందిన విభూష్టియా తండ్రి తిరుజ్ఞానసెల్వం వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ఆ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగినా సంబంధిత సంస్థకు చెందిన గైడ్‌ నిర్లక్ష్యం, సేవాలోపం కారణంగా వారిద్దరూ అలల్లో కొట్టుకుపోయి మృతిచెందారని తెలిపారు. సంస్థ సేవాలోపాన్ని పరిశీలించి రూ.1.50 కోట్ల నష్ట పరిహారం, కుమార్తె, అల్లుడిని కోల్పోవడంతో తనకు ఏర్పడిన మానసిక ఒత్తిడికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. విచారణ జరిపిన చెన్నై వినియోగదారుల కమిషన్‌… పర్యాటక సంస్థ సేవాలోపం కారణంగా ఇద్దరూ మృతి చెందారని తేల్చింది. బాధిత కుటుంబానికి రూ.1.50 కోట్ల పరిహారం, తిరుజ్ఞానసెల్వం అనుభవించిన మానసిక ఒత్తిడికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది.

Also Read : Rahul Gandhi: ప్రధాని మోదీ, ఎలక్షన్ కమీషన్ పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!