Contaminated Water in Guntur: గుంటూరు మున్సిపాలిటీలో కలుషిత త్రాగునీరు సరఫరా ? ఒకరు మృతి !

గుంటూరు మున్సిపాలిటీలో కలుషిత త్రాగునీరు సరఫరా ? ఒకరు మృతి !

Contaminated Water: గుంటూరు(Guntur) నగరంలో డయేరియా విజృంభిస్తోంది. శారదా కాలనీలో మున్సిపాలిటీ సరఫరా చేసిన నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మున్సిపాలిటీ అధికారులు సరఫరా చేసిన నీరు… త్రాగిన తరువాత వారు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిలో పద్మ అనే మహిళ మృతి చెందగా, మరో 40మంది జీజీహెచ్‌ లో చికిత్స పొందుతున్నారు. డయేరియా బాధితులను మున్సిపల్ కమిషనర్‌ చేకూరి కీర్తి, జనసేన, టీడీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం పద్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. పద్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆసుపత్రి నుండి మృతదేహాన్ని తరలించడానికి వీల్లేదంటూ నిరసన చేపట్టారు. ఇది ఇలా ఉండగా మూడు రోజుల క్రితం డయేరియాతో సంగడిగుంటకు చెందిన కొర్రపాటి ఓబులు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని… దానిని త్రాగడం వలన అనారోగ్యం బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

Contaminated Water – ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత !

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని చిల్డ్రన్ వార్డులో ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చిల్డ్రన్ వార్డులో మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేశారు. అయితే ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండడంతో వారిని వెంటనే ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.

Also Read : TSRTC News : తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు సర్కార్ శుభవార్త

Leave A Reply

Your Email Id will not be published!