Modi : భాషపై వివాదం మోదీ ఆగ్రహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కామెంట్స్
Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందీ భాషపై రగడ జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపింది.
హిందీ భాషపై వివాదం రేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ సమావేశంలో మోదీ(Modi) ప్రసంగించారు.
హిందీని భారత జాతీయ భాషగా పరిగణించాలా వద్దా అన్న చర్చ ప్రధానంగా జరుగుతున్న తరుణంలో ప్రధాని చేసిన కామెంట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. జైపూర్ లో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమాశేంలో ఆయన పాల్గొన్నారు.
భాషా వైవిధ్యం దేశానికి గర్వ కారణమన్నారు. కాగా దానిపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చాలా బాధకు గురి చేసిందన్నారు మోదీ. గత కొన్ని రోజులుగా భాషల ప్రాతిపదికన వివాదాలు కొనసాగుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రాంతీయ భాషను ప్రేమిస్తుంది. సమానంగా గౌరవిస్తుంది. ఆయా ప్రాంతాల భిన్న సంస్కృతుల పట్ల ఆదరణీయంగా ఉంటుందన్నారు. ఇది దేశ మెరుగైన భవిష్యత్తుకు దోహదం చేస్తుందన్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అన్ని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు మోదీ(Modi). ఇది ప్రాంతీయ భాషలపై తమకు ఉన్న నిబద్దతను తెలియ చేస్తోందని స్పష్టం చేశారు.
గత నెలలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ చైర్మన్ గా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రివర్గం ఎజెండా 70 శాతం హిందీలో తయారు చేయడం జరిగిందన్నారు.
హిందీని ఆంగ్లానికి ప్రత్యామ్నాయంగా అంగీకరించాలని కోరారు. కానీ స్థానిక భాషలకు లేదన్నారు. ఇది తీవ్ర దుమారానికి దారి తీసింది.
Also Read : జూన్ 20 లోగా పెగాసస్ రిపోర్ట్ ఇవ్వాలి