Covid19 Telangana : క‌రోనాపై తెలంగాణ స‌ర్కార్ ఫోక‌స్

పెరుగుతున్న కేసుల‌తో ప‌రేసాన్

Covid19 Telangana : దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా త‌న ప్ర‌భావాన్ని చూపిస్తోంది. గ‌త ఎనిమిది రోజుల నుంచి కేసుల తీవ్ర‌త పెరుగుతోంది. రోజుకు 10,000 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది.

ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ స‌మీక్ష చేప‌ట్టారు. ఈ మేర‌కు దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. అన్ని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని, బెడ్స్ , ఆక్సిజ‌న్ ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. క‌రోనాకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది కేంద్రం.

కాగా గ‌తంలో ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేసేది. కానీ ఈసారి ఏ రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది. దీంతో ఆయా రాష్ట్రాల‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం(Covid19 Telangana) అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు ఇవాళ్టి నుంచి అన్ని ఆస్ప‌త్రుల‌లో క‌రోనా వ్యాక్సిన్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్ల‌లో మునిగింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కూడా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇందులో భాగంగా 5 ల‌క్ష‌ల కార్బేవాక్స్ టీకా డోసుల‌ను అందుబాటులోకి తీసుకు వ‌స్తోంది. ఇక మొద‌టి డోసులు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ తీసుకున్నా బూస్ట‌ర్ డోస్ గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చ‌ని స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది.

Also Read : తెలంగాణ స‌ర్కార్ పై జంగు సైర‌న్

Leave A Reply

Your Email Id will not be published!