Jayapradha: సినీనటి జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపుర్ కోర్టు ఆదేశాలు !
సినీనటి జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపుర్ కోర్టు ఆదేశాలు !
Jayapradha: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్ లోని రాంపుర్ ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా… వాటి విచారణకు ఆమె గత కొంతకాలంగా గైర్హాజరు అవుతున్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినప్పటికీ… జయప్రద(Jayapradha) స్పందించలేదు, కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం తరుపన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళడంతో… వెంటనే ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. అయితే కోర్టు ఆదేశాలు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీపై జయప్రద ఇంతవరకు స్పందించలేదు.
Jayapradha Case Viral
సినీ నటి జయప్రద… 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ రెండు కేసులు రాంపుర్ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే విచారణలో భాగంగా ఆమెకు అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. దీనితో ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనితో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి.. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.
Also Read : Bomb Alert on Indigo Flight : ముంబైలో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్స్