Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకు అరెస్ట్ వారెంట్ !
వల్లభనేని వంశీకు అరెస్ట్ వారెంట్ !
Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీమోహన్ కు జయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులో జరిగిన సంఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబందించి గతంలో జరిగిన విచారణకు వల్లభనేని వంశీ గైర్హాజరయ్యారు. దీనితో గత విచారణలోనే కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే శుక్రవారం జరిగిన విచారణకు కూడా వంశీ హాజరుకాకపోవడంతో గతంలో జారీ చేసిన అరెస్ట్ వారెంటును అమలు చేయాలని పోలీసులను ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. దీనితో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు వంశీకు అరెస్ట్ వారెంట్ జారీచేయడంపై సంచలనంగా మారింది.
Vallabhaneni Vamsi Arrest
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూతు వద్ద జరిగిన ఘటనలో పోలీసులు 38 మందిపై నాలుగు కేసులు నమోదు చేసారు. టీడీపీ అభ్యర్ధిగా ఉన్న వల్లభనేని వంశీపై(Vallabhaneni Vamsi) కూడా కేసు నమోదు అయింది. ఈ కేసులకు సంబంధించి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఇటీవల వల్లభనేని వంశీ టీడీపీ నుండి బయటకు వచ్చి… పెద్ద ఎత్తున చంద్రబాబు, నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
Also Read : YS Sharmila : ప్రత్యేక హోదాపై వైసీపీ వైఖరి చెప్పాలంటూ షర్మిల దీక్ష