Covid19 Updates : దేశంలో ఊపందుకున్న కరోనా కేసులు
ఒక్క రోజులో 4,272 కొత్త కేసులు
Covid19 Updates : కరోనా మహమ్మారి మెల మెల్లగా కాటేసేందుకు రెడీ అవుతోంది. గత కొంత కాలం నుంచీ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు రాను రాను పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒక్క రోజులో 4,272 కోవిడ్ కేసులు(Covid19 Updates) నమోదయ్యాయి.
కరోనా కాటుకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మరణించిన వారి సంఖ్య 5,28,611కి చేరింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా 16 మంది కరోనా బారిన పడి మరణించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగింది. పెరిగిన కేసులతో కలుపుకుంటే దేశంలో 4,45,83,360కి చేరుకుంది. కాగా యాక్టివ్ కేసులు 40,750కి తగ్గాయని గురువారం స్పష్టం చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ.
ఇక రోజూ వారీ పాజిటివిటీ రేటు 1.35 శాతం నమోదు కాగా వారం వారీ పాజిటివిటీ రేటు 1.51 శాతంగా ఉంది. యాక్టివ్ కోవిడ్ కేసులు ఒక్క రోజులో 229 తగ్గగా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,13,999కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
మరో వైపు కేంద్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన దేశంలో వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. తానే భరించి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్కరు బూస్టర్ డోసు వేసుకోవాలని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కోరారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 218.17 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపింది కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
Also Read : బలవంతపు గర్భం అత్యాచారమే