CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌

CP Radhakrishnan : ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్‌ ను ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan)… స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్‌ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ రాధాకృష్ణన్‌ ఎంపికను ఖరారు చేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించాయి. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

CP Radhakrishnan Nominated as a Vice President

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాది వాసి కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ దక్షిణాది వాసి. సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు. జార్ఖండ్‌, తెలంగాణ గవర్నర్‌గా కూడా సేవలందించారు. ఇదిలా ఉంచితే, ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగాల్సి ఉండగా, ఆగస్టు 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

Also Read : Minister Nara Lokesh: నేడు దిల్లీకు మంత్రి నారా లోకేశ్‌ ! పలువురు కేంద్రమంత్రులతో భేటీ ?

Leave A Reply

Your Email Id will not be published!