CPI Leader Narayana: అద్వానీకు భారతరత్న ప్రకటించడంపై సీపీఐ నారాయణ ఆగ్రహం !

అద్వానీకు భారతరత్న ప్రకటించడంపై సీపీఐ నారాయణ ఆగ్రహం !

CPI Leader Narayana: బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌ కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Leader Narayana) తీవ్రంగా తప్పుపట్టారు. 1990లో అయోధ్య రామమందిరం కోసం రథయాత్ర పేరుతో దేశంలో మతకల్లోలాలు సృష్టించిన అద్వానీను… జైల్లో ఉంచకుండా భారతరత్న ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అప్పుడు జరిగిన మత ఘర్షణల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో వందలాది మంది గాయాలపాలయ్యారని గుర్తు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ ముద్దాయిగా కూడా ఉన్నారన్నారు. అటువంటి వ్యక్తికి భారతరత్న ప్రకటించి… దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

CPI Leader Narayana Comment

భారత ప్రధాని నరేంద్ర మోదీ… బీజీపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకు భారతరత్న ఇస్తున్నట్లు తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దీనితో ఎల్ కే అద్వానీకు భారతరత్న ప్రకటించడంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరియు వాటి అనుబంధ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దేశ చరిత్రలో ఎటువంటి అవినీతి మరకలు లేకుండా, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన అతి కొద్దిమంది రాజకీయనాయకుల్లో ఎల్ కే అద్వానీ ఒకరు… అటువంటి వారికి భారతరత్న అవార్డు ఇవ్వడం సముచితం అంటూ కొంతమంది ప్రశసింస్తుండగా… సీపీఐ నాయకులు మాత్రం ఎల్ కే అద్వానీకు భారతరత్న ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Venkaiah Naidu Praises : సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించిన మాజీ ఉప రాష్ట్రపతి

Leave A Reply

Your Email Id will not be published!