CPI Narayana : బాబు..పవన్ ‘ఇండియా’లో చేరాలి
పిలుపునిచ్చిన సీపీఐ నారాయణ
CPI Narayana : అమరావతి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆక్టోపస్ లా విస్తరించిన వైసీపీని మట్టి కరిపించాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇండియా అలయెన్స్ కూటమిలో చేరాలని పిలుపునిచ్చారు.
CPI Narayana Comment
నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని ధ్వజమెత్తారు.
అనకొండ లాగా మారి పోయిన వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన పార్టీలకు శక్తి చాలదని స్పష్టం చేశారు. అందుకే ఇండియా కూటమితో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు సీపీఐ నారాయణ(CPI Narayana). ఏపీలో వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ , జనసేన అందరూ కలిసి కట్టుగా కలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
లేకపోతే ఈసారి కూడా జగన్ మోహన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు సీపీఐ నారాయణ. ఇకనైనా మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచించాలని సూచించారు. దేశంలో తమ కూటమి రాబోయే రోజుల్లో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
Also Read : PM Modi Flags : 30న అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు