CPI Narayana : నారాయణ షాకింగ్ కామెంట్స్
బీజేపీ..ఎంఐఎం ..బీఆర్ఎస్ ఒక్కటే
CPI Narayana : హైదరాబాద్ – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలన్నీ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎందుకని గోషా మహల్ లో బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కు వ్యతిరేకంగా ఎంఐఎం ఎందుకు అభ్యర్థిని బరిలోకి దింప లేదంటూ ప్రశ్నించారు.
CPI Narayana Comments Viral
విచిత్రం ఏమిటంటే తెలంగాణలో ఆంధ్రా షెటిలర్స్ ఓటర్ల కోసం కేటీఆర్, కేసీఆర్ చంద్రబాబు నాయుడు అపాయింట్ కోరారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బయటకు చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి అంటూ పేర్కొన్నారు.
నారాయణ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు నారాయణ(CPI Narayana). అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేలా రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు రాక పోవచ్చని అభిప్రాయ పడ్డారు. తిరిగి పవర్ లోకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదని కానీ ఊహించని విధంగా ప్రజా వ్యతిరేకత ఉందన్నారు.
Also Read : Revanth Reddy : టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేస్తాం