CPM: ప్రేమ వివాహాలకు మా పార్టీ ఆఫీసులు రెడీ – సీపీఎం
ప్రేమ వివాహాలకు మా పార్టీ ఆఫీసులు రెడీ - సీపీఎం
CPM : సీపీఎం కార్యాలయాన్ని కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణవేదికగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన తన ఎక్స్‌పేజీలో ఈ విషయం పోస్ట్‌చేశారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించలేదని, వేర్వేరు కులాలకు చెందిన యవతీ, యువకులు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని తమ పార్టీ ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఎం (CPM) కార్యాలయాల్లో కులాంతర వివాహాలు జరుపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని షణ్ముగం డిమాండ్ చేశారు.
CPM – రాముని భక్తుల ఓటు వీసీకేకు వెళ్లకూడదు
రాముడిని పూజించేవారి ఒక్క ఓటు కూడా వీసీకేకు వెళ్లకూడదని బీజేపీ (BJP) సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో జరిగే ఎలాంటి హిందూ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనరని, కేరళ సీఎం పినరయి విజయన్ సెప్టెంబరులో నిర్వహించనున్న ప్రపంచ అయ్యప్ప భక్తుల సదస్సులో పాల్గొననున్నారని చెప్పారు. ఇది ఎలాంటి విశ్వాసమో స్టాలిన్ చెప్పాలని, ఆయన చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు.
వీసీకే ఉప ప్రధాన కార్యదర్శి వన్నియరసు రాముడిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. డీఎంకే పాలనలో జరిగే పరువు హత్యలను అడ్డుకోవడానికి, వాటికి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడానికి డిమాండ్ చేయకుండా ఇక్కడ జరుగుతున్న పరువు హత్యలకు రాముడు, సనాతన ధర్మం కూడా కారణమని వన్నియరసు అంటున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. భాజపా తరఫున వన్నీ ప్రభుత్వానికి కంబరామాయణం పుస్తకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఆయన పెరియార్‌వాది అని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఈ విషయం కేరళ ముఖ్యమంత్రికి తెలియక స్టాలిన్‌ను అయ్యప్ప భక్తుల సదస్సుకు ఆహ్వానించి ఉంటారన్నారు.
Also Read : Chennai Airport: చెన్నై ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం, కొకైన్ సీజ్
