Jai Shankar : సీమాంతర ఉగ్రవాదం ప్రమాదం – జైశంకర్
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎదుట కన్నెర్ర
Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(Jai Shankar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గోవా వేదికగా జరిగిన జి20 , ఎస్ సివో సమావేశంలో పాకిస్తాన్ , చైనా విదేశాంగ శాఖ మంత్రలు పాల్గొన్నారు. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ సమావేశంలో ఉగ్రవాదంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది.
దీనిని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది అంతర్జాతీయ వేదికలపై. ఇక ఊహించని రీతిలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో 12 ఏళ్ల తర్వాత మొదటిసారిగా భారత్ లో అడుగు పెట్టారు. జై శంకర్ తో ద్వైపాక్షిక చర్చలు ఉంటాయా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
ఈ సందర్బంగా చైనా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల ముందే ప్రసంగించిన సుబ్రమణ్యం జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన లేదన్నారు. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లో ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
ప్రపంచం కరోనాను, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. కానీ ఈ రెండు కంటే ఎక్కువగా ఉగ్రవాదం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సుబ్రమణ్యం జై శంకర్. తీవ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలి. ఆర్థిక సాయం చేసే వారిని నియంత్రించాలని పిలుపునిచ్చారు.
Also Read : కలుద్దాం ముందుకు సాగుదాం – గ్యాంగ్