MLA Defection Case: పార్టీ ఫిరాయింపు కేసులో పూర్తయిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్

పార్టీ ఫిరాయింపు కేసులో పూర్తయిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్

MLA Defection Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో (MLA Defection Case) విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు… ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఇవాళ ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ చాంబర్లో విచారణ కొనసాగింది. ఈనెల 1వ తేదీన జగరగాల్సిన విచారణ వాయిదా పడటంతో.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు విచారణకు హాజరయ్యారు.

MLA Defection Case Updates

బీఆర్‌ఎస్‌లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో సుప్రీకోర్టును బీఆర్ఎస్ (BRS) ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. ఈ మేరకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. అయితే దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులు వారు పార్టీ మారని వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. దీనిలో భాగంగా పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యేల విచారణలు ముగిసిన అనంతరం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలల్లోపు టిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేయకపోతే ఉద్యమిస్తాం – హరీశ్‌రావు

గతంలో టిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్‌ తలపెట్టారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. నిర్మాణ పనులను రేవంత్‌రెడ్డి సర్కార్‌ నత్తనడకన చేస్తోందని విమర్శించారు. కొత్తపేటలో టిమ్స్‌ భవనాలను పార్టీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, వివేకానంద, కాలేరు వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడతూ… తమ ప్రభుత్వం ఉండి ఉంటే.. ఇప్పటికే టిమ్స్‌ పూర్తయ్యేదని చెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారులో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని దుయ్యబట్టారు. ఆరు నెలల్లోపు టిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని.. లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read : TGSRTC: జంట నగరాల పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

Leave A Reply

Your Email Id will not be published!