CRPF: మావోల కంచుకోట బస్తర్‌ లో 10వేల రేడియో సెట్‌లు పంపిణీ

మావోల కంచుకోట బస్తర్‌ లో 10వేల రేడియో సెట్‌లు పంపిణీ

CRPF : మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… ప్రభావిత ప్రాంతాల్లో అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మావోల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్‌ ప్రజల్లో మావోయిస్టు భావజాలాన్ని తొలగించి… వారికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వారిలో జాతీయ భావనను పెంచేందుకు గాను భద్రతా దళాలు (CRPF) రేడియో సెట్‌లను అందించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నాలుగు నెలల్లో దాదాపు 10వేలకు పైగా రేడియో సెట్‌లను అక్కడి స్థానికులకు పంపిణీ చేశాయి.

CRPF New Innovation

మావోయిస్టుల నిర్మూలనకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర హోంశాఖ.. బస్తర్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ సాయంతో వందలాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా రేడియో సెట్‌లను పంపిణీ చేసి.. ప్రధాని మోదీ ప్రతినెల సామాన్యులతో సంభాషించే మన్‌-కీ-బాత్‌తోపాటు వివిధ ప్రభుత్వ పథకాలు, వినోద కార్యక్రమాలను వినేలా ఏర్పాట్లు చేసింది.

మొత్తంగా అక్కడ మోహరించిన 180 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలకు 60 రేడియోల చొప్పున కేటాయించగా.. వాటిని మారుమూల ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 54వేల మందిని ప్రధాన స్రవంతికి చేరువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో రేడియో సెట్‌ ఖరీదు రూ.1500గా అంచనా. బ్యాటరీలు లేదా కరెంటుతో పనిచేసేలా ఈ రేడియోలను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Also Read : Mohan Bhagwat: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!