CWG 2022 India : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 26 పతకాలు
పతకాల పట్టికలో ఇండియాకు ఐదవ స్థానం
CWG 2022 India : బ్రిటన్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022(CWG 2022 India) లో భారత క్రీడాకారులు దుమ్ము రేపుతున్నారు. ఇప్పటి వరకు భారత్ కు వివిధ విభాగాలలో 26 పతకాలు దక్కాయి.
మొత్తం జాబితాలో ఈ పతకాలతో ఐదవ స్థానంలో నిలిచింది కడపలి వార్తలు అందేసరికి. వెయిట్ లిఫ్ట్ విభాగంలో అత్యధికంగా పతకాలు దక్కాయి ఇండియాకు.
సంకేత్ మహదేవ్ సర్గర్ జూలై 29న 248 కేజీలు ఎత్తి వెండి పతకాన్ని కైవసం చేసుకుని భారత్ కు మొదటి పతకంతో శుభారంభం అందించాడు. ఇక భారత్ కు తొలి స్వర్ణం మీరా బాయి చాను అందించింది.
అదే వెయిట్ లిఫ్టింగ్ లో జెరెమీ లాల్రిన్నుంగా , అచింత షెయులీలు స్వర్ణాలు సాధించారు. ఇక సాధించిన పతకాల పరంగా చూస్తే 9 బంగారు
పతకాలు, 8 రజత పతకాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
విభాగాల వారీగా చూస్తే వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ వెండి పతకం సాధిస్తే, మీరా బాయి చాను బంగారం, గురు రాజా పూజారి కాంస్యం,
బింద్యా రాణి దేవి రజతం, జెరెమీ లాల్రిన్నుంగా, అచింత షెయులి పసిడి పతకాలు సాధించారు.
ఇక జూడో విబాగంలో సుశీలా దేవీ వెండి, విజయ్ యాదవ్ కాంస్యం సాధించారు. హర్జిందర్ కౌర్ కాంస్యం, మహిళల జట్టు లాన్ బౌల్స్ లో స్వర్ణం సాధించింది. టేబుల్ టెన్నిస్ లో పురుషుల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
వికాస్ ఠాకూర్ రజత పతకం, బ్యాడ్మింటన్ లో మిక్స్ డ్ టీం రజతం, తులికా మన్ జూడోలో కాంస్య పతకాన్ని పొందారు.
లవ్ ప్రీత్ సింగ్ కాంస్యం, సౌరవ్ ఘోషల్ స్క్వాష్ లో కాంస్యం, గుర్దీప్ సింగ్ కాంస్యం, తేజస్విన్ శంకర్ కాంస్యం, మురళీ శ్రీ శంకర్ రజతం సాధించారు.
పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ బంగారు పతకాన్ని, అన్షు మాలిక్ రజతం, బజరంగ్ పునియా రెజ్లింగ్ లో స్వర్ణం, సాక్షి మాలిక్ రెజ్లింగ్ లో స్వర్ణం,
దీపక్ పునియా రెజ్లింగ్ లో స్వర్ణం , దివ్య కక్రాన్ రెజ్లింగ్ లో కాంస్యం, మోహిత్ గ్రేవాల్ రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని సాధించాడు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా