D Haritha: అనంతపురం జేసీగా హరిత పోస్టింగ్ రద్దు !
అనంతపురం జేసీగా హరిత పోస్టింగ్ రద్దు !
D Haritha: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదీలీలు జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వం హయాంలో వైసీపీ అనుకూలంగా, నిబంధనలకు విరుద్ధంగా, అప్పటి ప్రతిపక్ష పార్టీలపై ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల బదిలీల విషయంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేసిన డి హరిత(D Haritha)కు షాక్ ప్రభుత్వం ఇచ్చింది. ఆమె అనంతపురం జాయింట్ కలెక్టర్ గా విధుల్లో చేరకుముందే ఆమె పోస్టింగ్ ను నిలుపుదల చేసింది. అంతేకాదు ఆమెను జీఏడిలో రిపోర్ట్ చేయాలంటూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వలు జారీ చేసారు. దీనితో ఐఏఎస్ అధికారిని హరిత బదిలీ విషయం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
D Haritha – వెంకటరమణారెడ్డి ట్వీట్ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం ?
అయితే తాను చూసిన అత్యంత అవినీతిపరులైన అధికారుల్లో హరిత ఒకరని, తిరుపతి కార్పొరేషన్‌లో జరిగిన టీడీఆర్ బాండ్‌ల కుంభకోణానికి సూత్రధారి ఆమేనంటూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఇటీవల ‘ఎక్స్’లో పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ నేపథ్యంలోనే ఆమె పోస్టింగ్‌ని ప్రభుత్వం రద్దు చేసినట్టు సమాచారం. తిరుపతి డిప్యూటీ కమిషనర్ గా ఉండగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలసి ఆమె అనేక అవకతవకలకు పాల్పడినట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోస్టింగ్ నిలుపుదల చేయడంతో పాటు జీఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ !