D Roopa Rohini Sindhuri : సింధూరిపై రూప అభియోగాలు ఇవే
19 ఆరోపణల జాబితా
D Roopa Rohini Sindhuri : కన్నడ నాట కొత్త వివాదం మొదలైంది. సీనియర్ ఐపీఎస్ , ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ కు ఎండీగా ఉన్న డి. రూప మౌద్గిల్ సంచలన ఆరోపణలు చేశారు సీనియర్ ఆఫీసర్ , దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న రోహిణి సింధూరిపై. ఇంతకు ఫేస్ బుక్ పేజీలో రూప చేసిన సంచలన అభియోగాలు ఇవే.
మొత్తం 19 ఆరోపణలు గుప్పించింది. సింధూరి చేసిన అక్రమాల చిట్టా తన వద్ద ఉందని ఆరోపించింది. డీకే రవి విషయంలో ఏం జరిగిందో చెప్పాలి. సింధూరి మాండ్యా జిల్లా పంచాయతీకి సిఇఓగా ఉన్న సమయంలో మరుగుదొడ్ల నిర్మాణంలో ఆరోపణలు వచ్చాయి.
వాటిపై విచారణ ఎందుకు జరపలేదు. కరోనా సమయంలో ఆక్సిజన్ లేక చామరాజనగర్ లో 24 మంది మరణించారు. కానీ సింధూరిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది రూప(D Roopa Rohini Sindhuri). సింధూరి తన వద్ద పని చేసిన కన్నడ ఐఏఎస్ ఆఫీసర్ శిల్పా నాగ్ ను వేధింపులకు గురి చేసింది నిజం కాదా.
హర్ష్ గుప్తా నిజాయితీ కలిగిన ఆఫీసర్. ఆయనను కూడా ఇబ్బందులకు గురి చేసింది. డీకే రవి, ఎన్ హరీస్ సూసైడ్ కు కారణం ఎవరో చెప్పాలి. ఆనాటి మంత్రి సారా మహేష్ పై ఆరోపణలు చేసింది. ఒక్కటి కూడా రుజువు కాలేదు.
చివరకు మధ్యవర్తిత్వం కోసం వెళ్లిందని ఆరోపించింది. ఎంపీ ప్రతాప సింహాపై సింధూరి నిరాధార ఆరోపణలు చేసిందన్నారు. ఆమె మైసూరు డీసీగా ఎలా నియమించబడ్డారో చెప్పాలన్నారు.
రోహిణి కోసం ఓ టీం ఉంది. చాలా ఎక్కువ ధరకు చౌక సంచులను విక్రయించారు. దీనిపై ఆమెపై విచారణ జరపాలని లోకాయుక్త ఆదేశించింది.
కానీ సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు రూప. సింధూరి తన ప్రైవేట్ ఫోటోలను చాలా మంది ఐఏఎస్ లకు పంపించిందని ఆరోపించింది.
Also Read : కన్నడ నాట ‘సింధూరి రూప’ వార్