Asha Parekh : ఆశా ప‌రేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

దేశంలోనే అత్యున్న‌త‌మైన పుర‌స్కారం

Asha Parekh : ప్ర‌ముఖ న‌టి ఆశా ప‌రేఖ్ కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ విష‌యాన్ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది కేంద్రం. 1992లో ఆశా ప‌రేఖ్ కు ప‌ద్మ‌శ్రీ అవార్డుతో స‌త్క‌రించింది ప్ర‌భుత్వం.

హిందీ సినిమా రంగంలో ఆషా ప‌రేఖ్(Asha Parekh) ప్ర‌త్యేక‌త చాటుకున్నారు త‌న న‌ట‌న‌తో. 1960 నుంచి 1970 దాకా ప్ర‌తిభ‌తో రాణ‌ఙంచారు. 10 ఏళ్ల వ‌య‌సులో 1952లో వ‌చ్చిన మా మూవీలో న‌టించారు. నాసిర్ హుస్సేన్ తీసిన దిల్ దేక్ దేఖో లో న‌టించారు.

ఇందులో ష‌మ్మీ కపూర్ హీరో. బ‌హ‌రోన్ స‌ప్నే, ప్యార్ కా మౌసం, కార‌వాన్ , రాజ్ ఖోస్లాస్ డూ బాడ్ , చిరాగ్, మెయిన్ తుల‌సీ తేరే ఆంగ‌న్ కే త‌దిత‌ర పేరొందిన‌, విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించారు ఆశా ప‌రేఖ్. విషాద పాత్ర‌ల‌లో ఆమె మంచి పేరు సంపాదించింది.

ఆశా ప‌రేఖ్ గుజ‌రాతీ, పంజాబీ, క‌న్న‌డ చిత్రాల‌లో కూడా న‌టించారు. ఆ త‌ర్వాత టెలివిజ‌న్ మాధ్య‌మానికి వెళ్లారు. గుజరాతీ సీరియ‌ల్ జ్యోతి తీసింది. దీనికి ఆశా ప‌రేఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప‌లాష్ కే పూల్ , బాజే పాయ‌ల్ , కోరా కాగ‌జ్ , డాల్ మెయిన్ కాలా వంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఇచ్చింది. ఇక పోతే భార‌తీయ సినిమాల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అన్న‌ది అత్యున్న‌త పుర‌స్కారం.

గ‌తంలో రాజ్ క‌పూర్ , య‌ష్ చోప్రా, ల‌తా మంగేష్క‌ర్ , మృణాల్ సేన్ , అమితాబ్ బ‌చ్చ‌న్ , వినోద్ ఖ‌న్నా, దేవికా రాణి, ర‌జ‌నీకాంత్ పొందారు.

Also Read : రూ. 400 కోట్లు దాటేసిన బ్ర‌హ్మాస్త్ర

Leave A Reply

Your Email Id will not be published!