Brahmastra Movie : రూ. 400 కోట్లు దాటేసిన బ్ర‌హ్మాస్త్ర

దేశీయంగా రూ. 250 కోట్ల మార్క్

Brahmastra Movie : బాలీవుడ్ కు చెందిన బ్ర‌హ్మాస్త్ర మూవీ(Brahmastra Movie) ఊహించ‌ని రీతిలో రూ. 400 కోట్లు దాటేసింది. ఈ మ‌ధ్య హిందీ సినిమాలు రిలీజ్ అయినా ఇంత భారీ ఎత్తున స‌క్సెస్ సాధించిన దాఖ‌లాలు లేవు. ఇక దేశ వ్యాప్తంగా రూ. 250 కోట్ల‌ను దాటేసింది. ఈ చిత్రం గ‌త మూడు రోజుల‌లో రూ 23 కోట్లు రాబ‌ట్టింది.

ఈ మొత్తం వ‌సూళ్ల‌తో వ‌ర‌ల్డ్ వైడ్ గా నాలుగు వంద‌ల కోట్ల మార్క్ ను దాటేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ఇంతటి స్థాయిలో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన ఏకైక హిందీ చిత్రం కావ‌డం విశేషం. జాతీయ సినిమా దినోత్స‌వం రోజున రూ. 10.8 కోట్లు సాధించింది బ్ర‌హ్మాస్త్ర‌(Brahmastra Movie). ర‌ణ‌బీర్ క‌పూర్ , అలియా భ‌ట్ క‌లిసి న‌టించారు ఈ మూవీలో.

రూ. 104 ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్ క‌లిగి ఉంది. రూ. 301 కోట్ల గ్రాస్ డొమెస్టిక్ ఫిగ‌ర్ ను జోడించింది. ఇంకా ఆది, సోమ వారానికి సంబంధించి క‌లెక్ష‌న్ల వివ‌రాలు రావాల్సి ఉంది. దేశీయంగా చూస్తే రూ. 253 కోట్లుగా ఉంది. కాశ్మీర్ పైల్స్ కంటే ఎక్కువ‌. గ్లోబ‌ల్ ఫిగ‌ర్ ను కూడా ఎప్పుడో దాటేసింది బ్ర‌హ్మాస్త్ర‌.

ఇదిలా ఉండ‌గా హిందీలో డ‌బ్బింగ్ చేసిన ఆర్ఆర్ఆర్ రూ. 274 కోట్లు వ‌సూలు చేయ‌గా య‌శ్ న‌టించిన కేజీఎఫ్ రూ. 434 కోట్లు సాధించాయి. ఈ చిత్రాల కంటే బ్ర‌హ్మాస్త్ర ఇంకా వెనుక‌బ‌డి ఉంది. హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్ ఇప్ప‌టికీ దాదాపు రూ. 234 కోట్లు నిక‌రంగా ఉన్నాయి. మిగిలిన‌వి డ‌బ్బింగ్ వెర్ష‌న్ ల నుండి వ‌స్తున్నాయి.

Also Read : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!