Dadi Veerabhadra Rao Resign : వైసీపీని వీడిన కీలక నేత..మాజీ మంత్రి దాడి

తదుపరి టీడీపీకి వెళ్తారా మరి ఏ పార్టీకి వెళ్తారో చూడాలి

Dadi Veerabhadra Rao : విశాఖ రాజకీయాల్లో మరో కలకలం రేగింది అనుచరులతో కలిసి సమావేశం అయ్యారు, వైసీపీ కి రాజీనామా చేసారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఏక వ్యాఖ్యం తో రాజీనామా లేక రాసారు.

Dadi Veerabhadra Rao Resign Viral

ఇక రాజీనామా కాపీని సజ్జల మరియు విజయ సాయి రెడ్డికి పంపారు, వైసీపీ కి రాజీనామా చేసిన దాడి రాజీనామా చేసేముందే తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు, కొంత కాలంగా పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు దాడి.

దాడి వీరభద్ర రావుని చూసుకుంటే అయన గతం లో టీడీపీ లో పనిచేసారు తరవాత వైసీపీ లో చేరారు. వైసీపీలోకి(YSRCP) వచ్చినప్పటి నుంచి తనకు తగిన ప్రాధాన్యత లేదు అన్న ఒక అసంతృప్తితి భావంతో ఐతే దాడి వీరభద్ర రావు ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఏంఏల్సీ ఎన్నికలకు సంబంధించిన లేదా, ఏంఏల్సీ నియామకాలకు సంబందించిన కసరత్తు జరిగినప్పుడు కూడా తనకు ఏంఏల్సీ పదవి వస్తుందని ఆశించారు. లేదా తన కుమారుడికి టికెట్ ఈసారన్నా వస్తుంది అని ఆశాభావం అయన పెట్టుకున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో బవుసా దాడి వీరభద్ర రావుకు లేదా అయన కుమారుడికి అవకాశం లేదు అని తేలిందా అన్నది చూడాల్సి ఉంటుంది. చాలాకాలం నుంచి పార్టీలో ఆక్టివ్ గా లేరు అనేది మాత్రం చెప్పుకోవాలి..

దాడి వీరభద్ర రావు ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి విశాఖపట్నం నుంచి అయన రాజీనామా చేసారు దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందో మనం ఇంకా చూడాలి. మరికొన్ని రాజీనామాలు కూడా పార్టీ నుంచి కచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాల మంది అసంతృప్తి చెంది ఉన్నారు, చాలామంది ఆసిస్తూ ఉన్నారు టికెట్ వస్తుంది పార్టీ నుంచి అని ఇలాంటి నాయకులను బుజ్జగించే ప్రయత్నం జరిగినప్పటికీ కొంతమంది సహజంగానే వీడుతా ఉన్నారు.

Also Read : YS Sharmila : వైయస్సార్ టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్న వైయస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!