Danasari Seethakka : ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
మంత్రి దాసరి సీతక్క కామెంట్స్
Danasari Seethakka : హైదరాబాద్ – ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు ఇప్పటికే అమలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి దాసరి సీతక్క . ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంకా నాలుగు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Danasari Seethakka Comment
ఈనెల 28 నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు అభయ హస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
పక్కగా మిగిలి పోయిన నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తామని కుండ బద్దలు కొట్టారు మంత్రి దాసరి సీతక్క(Danasari Seethakka). అధికారంలోకి వచ్చి వారం రోజులు కూడా కాలేదన్నారు. అంతలోనే గులాబీ నేతలు నోరు పారేసు కోవడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
అధికారాన్ని కోల్పోయినా ఇంకా ఆరోపణలు చేయడం మానుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి పోదని, ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు సీతక్క. ప్రజా పాలన తీసుకు వస్తామని చెప్పామని ఆచరణలో ఇది జరుగుతోందన్నారు.
ఇక ఇప్పటికైనా విమర్శలు చేయడం మానుకోవాలని లేక పోతే ప్రజలు ఛీ కొట్టడం ఖాయమని అన్నారు.
Also Read : Mallu Bhatti Vikramarka : సమస్యల విన్నపం పీఎం సానుకూలం