Dasoju Sravan : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన భూమికను నిర్వహించిన డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan) భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ జుగ్ సారథ్యంలో పార్టీలో చేరారు.
అనంతరం దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి ని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నా. ఏబీవీపీలో పని చేశా..ఇప్పుడు స్వంత ఇంటికి వచ్చినంత ఆనందం కలిగిందన్నారు దాసోజు శ్రవణ్.
1,500 వందల మంది అమరవీరుల త్యాగాల, బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో అవినీతి, అక్రమాలు, దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డూ అదుపు లేకుండా కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు.
చీకోటి ప్రవీణ్ లాంటి సంఘ విద్రోహ శక్తులకు వత్తాసు పలుకుతూ భ్రష్టు పట్టిస్తున్నారంటూ మండిపడారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). తెలంగాణలో అధికార మార్పిడి జరగాల్సిన అవసరం ఉందన్నారు.
రూ. 35 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచిన ఘనత ఈ మహానుభావుడిదేనన్నారు. ఇదిలా ఉండగా దాసోజు శ్రవణ్ గతంలో ప్రజారాజ్యం, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు.
Also Read : గుజరాత్ లో గెలిపిస్తే 10 లక్షల కొలువులు