INDIA Block : రోజురోజుకు ‘ఇండియా కూటమి’ నుంచి మమతా బెనర్జీకి పెరుగుతున్న మద్దతు

ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తుంది...

INDIA : ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన మంగళవారం పాట్నాలో వెల్లడించారు. మమతాకు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీని పలుమార్లు మమతా బెనర్జీ(Mamata Banerjee) ఓడించారని.. అలాంటి వేళ ఇండియా కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం సముచితమని ఎంపీ కీర్తి ఆజాద్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే.

INDIA Block Updates

భాగస్వామ్య పక్షాలు కోరితే ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. దీనిపై సర్వత్ర చర్చ ప్రారంభమైంది. ఇక సీఎం మమతా బెనర్జీ చేసిన తాజా ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. దీనిని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉందంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలు ఆమె నాయకత్వం వహించేందుకు సుముఖత వ్యక్తం చేసిన విషయం విధితమే.

ఇండియా కూటమికి(INDIA Block) ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ సరైన సత్తా చాటకుంటే.. తానేం చేయలేనని.. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మమతా బెనర్జీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడు సార్లు అధికారం చేపట్టినప్పటికీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయని గుర్తు చేసింది.బెంగాల్ పొరుగున్న రాష్ట్రాల్లో పార్టీని విస్తరించలేని వారు.. జాతీయ స్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఎలా రాణించగలరంటూ సీఎం మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

తానుఇండియా కూటమిని ఏర్పాటు చేశానన్నారు. ప్రస్తుతం దానిని నిర్వహించడం ముందు ముందున్న వారిపై ఉంది. వారు ప్రదర్శనను నిర్వహించ లేకపోతే, నేను ఏమి చేయగలను? అని ప్రశ్నించారు. అందరినీ వెంట తీసుకెళ్లాలని తాను చెప్తానన్నారు. అవకాశం దొరికితే దాని సజావుగా సాగేలా చూస్తానని మమత బెనర్జీ స్పష్టం చేశారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ నుంచి బయటకు వెళ్లడం ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. కానీ తాను ఇక్కడ నుండి అమలు చేయగలనంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం విధితమే. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ సత్తా చాటింది. కానీ జార్ఖండ్ లో మాత్రం ఇండియా కూటమికి చెందిన జార్ఖండ్ మూక్తి మోర్చ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Also Read : Minister PK Shekhar : మదురై కుంభమేళా పై కీలక అప్డేట్ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!