Sabitha Indra Reddy : డీఏవీ పాఠశాల గుర్తింపు ర‌ద్దు – స‌బిత

డిఇఓను ఆదేశించిన విద్యా శాఖ మంత్రి

Sabitha Indra Reddy : ఇరు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపింది చిన్నారి రేప్ ఘ‌ట‌న‌. అన్నెం పున్నెం ఎరుగ‌ని నాలుగేళ్ల చిన్నారిపై గ‌త కొంత కాలంగా అత్యాచారానికి పాల్ప‌డ‌డం వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్ డీఏవీ పాఠ‌శాల‌లో చోటు చేసుకుంది. పేరెంట్స్ తో పాటు బాధిత చిన్నారి త‌ల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు.

దీంతో ఆ పాఠ‌శాల ప్రిన్సిపాల్ మాధ‌వితో పాటు అత్యాచారానికి పాల్ప‌డుతూ వ‌స్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ్రైవ‌ర్ 34 ఏళ్ల ర‌జ‌నీకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న మంత్రి వెంట‌నే ఘ‌ట‌న గురించి ఆరా తీశారు.

ఈ మేర‌కు బీఎస్ డీఏవీ పాఠ‌శాల గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు స‌బితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy). ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

అంతే కాకుండా ప్ర‌స్తుతం ఆ బ‌డిలో చ‌దువుకుంటున్న విద్యార్థులు ఈ ఏడాది న‌ష్ట పోకుండా ఉండేలా ప‌క్క‌నే ఉన్న బ‌డిలో స‌ర్దుబాటు చేయాల‌ని ఆదేశించారు మంత్రి.

ఈ విష‌యంలో విద్యార్థుల పేరెంట్స్ కు తెలియ చేయాల‌ని, ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాల‌ని డిఈఓకు స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు పాఠ‌శాల విద్యా శాఖ కార్య‌ద‌ర్శి సార‌థ్యంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఇంకా ఎంత మంది చిన్నారులు బ‌ల‌య్యార‌నే దానిపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read : బీజేపీకి దాసోజు శ్ర‌వ‌ణ్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!