Deepak Hooda : దీప‌క్ హూడా సూప‌ర్ ఇన్నింగ్స్

41 ర‌న్స్ 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు

Deepak Hooda : ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలో జ‌రిగిన మ్యాచ్ లో ల‌క్నో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఏ కోశాన పోటీ ఇవ్వ‌లేక పోయింది. ఏకంగా 75 ప‌రుగుల భారీ తేడాతో ఓట‌మి పాలైంది.

ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో 16 పాయింట్లు సాధించి టాప్ లో నిలిచింది. ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే 101 ప‌రుగుల‌కు చాప చుట్టేసింది. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయొంట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ర‌న్స్ చేసింది.

అనంత‌రం టార్గెట్ ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన కోల్ క‌తా బ్యాట‌ర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 101 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. ఇదిలా ఉంగా క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే ల‌క్నో సూప‌ర్ జెయొంట్స్ స్కిప్ప‌ర్ కేఎల్ రాహుల్ తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు.

లేని ప‌రుగు చేసేందుకు పోయి డ‌కౌట్ గా వెనుదిరిగాడు. ఈ త‌రుణంలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు క్వింట‌న్ డికాక్ , దీపక్ హూడా(Deepak Hooda). వీరిద్ద‌రూ క‌లిసి వికెట్లు పోకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. జ‌ట్టుకు స్కోర్ పెంచేందుకు ప్ర‌య‌త్నించారు.

డికాక్ హాఫ్ సెంచ‌రీ చేస్తే దీప‌క హూడా(Deepak Hooda) 41 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక ఆఖ‌రులో వ‌చ్చిన స్టాయినిస్ స‌త్తా చాటాడు. కేవ‌లం 14 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ క్రికెట‌ర్ 28 ప‌రుగులు చేశాడు.

ప్ర‌తి బంతికి రెండు ర‌న్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ 3 సిక్స‌ర్లు ఉన్నాయి. అనంత‌రం ఆవేశ్ ఖాన్ , జేస‌న్ హోల్డ‌ర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

 

Also Read : ఆ ఇద్ద‌రు స్పిన్న‌ర్లు అద్భుతం – భ‌జ్జీ

Leave A Reply

Your Email Id will not be published!