Rahul Gandhi : డిఫెన్స్ పరికరాల కాంట్రాక్టు అదానీకి
ఎలా ఇస్తారని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi Defence Firm : దేశ వ్యాప్తంగా అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ వివాదం కలకలం రేపుతోంది. ఈ తరుణంలో మరో సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. బుధవారం ట్విట్టర్ వేదికగా అదానీపై నిప్పులు చెరిగారు. భారత దేశంలోని రక్షణ శాఖకు సంబంధించిన పరికరాల తయారీ కాంట్రాక్టు అదానీ కంపెనీతో పాటు ఎలారా అనే సందేహాస్పదమైన విదేశీ సంస్థకు అప్పగించారని ఆరోపించారు.
ఇందుకు సంబంధించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ప్రత్యేక కథనాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. మోదీ ఇకనైనా నోరు తెరవాలని , దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.
విదేశీ సంస్థ అయిన ఎలారాను ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించారు. తెలియని విదేశీ సంస్థలకు వ్యూహాత్మక రక్షణ పరికరాలను అప్పగించడం వెనుక భారత దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లదా అని నిలదీశారు కాంగ్రెస్ అగ్ర నేత(Rahul Gandhi Defence Firm).
ఇదిలా ఉండగా రక్షణ శాఖకు సంబంధించిన పరికరాల తయారీ కాంట్రాక్టు ఎలా అదానీకి ఇచ్చారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలారా అనేది మరో పెట్టుబడిదారుడు కాదు. అదానీ గ్రూప్ తో పాటు బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏడీటీపీఎల్) అనే డిఫెన్స్ కంపెనీలో ఇది ప్రమోటర్ సంస్థ.
ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (ఎలారా ఐఓఎఫ్ ) వెంచర్ క్యాపిటల్ ఫండ్. మారిషస్ లో ఇది నమోదు చేయబడిన నాలుగు సంస్థలలో అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రధానంగా షేర్లను కలిగి ఉంది. దీనిపైనే నిలదీశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : భారత రాయబారిగా ఎరిక్ గార్సెట్టి