Delhi CM : ఢిల్లీలో విద్యా సంస్థలకు సెలవు
జూలై 18 వరకు ప్రకటించిన సీఎం
Delhi CM : దేశంలోని పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. యమునా నది పోటెత్తుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కుండ పోతగా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల రహదారులు నిండి పోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పట్లో వర్షాలు తగ్గక పోవడంతో ఢిల్లీ అంతటా ఆప్ ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) రంగంలోకి దిగారు. దీనిపై కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సారథ్యంలో డీడీఎంఏ సమావేశం జరిగింది. ముందు జాగ్రత్తగా పాఠశాల, కళాశాల, విశ్వ విద్యాలయాలను పూర్తిగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. జూలై 18న ఆదివారం వరకు విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కొన్నింటిని మూసి వేస్తున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. సహాయక శిబిరాలను పాఠశాలలకు తరలిస్తున్నట్లు చెప్పారు సీఎం. సాయంత్రం వరకు యుమనా నది నీటి మట్టం పెరుగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
మరో వైపు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వణుకుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగి పడ్డాయి. పలు చోట్ల నీళ్ల దెబ్బకు భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది.
Also Read : Botsa Satyanarayana : బొత్స కామెంట్స్ కలకలం