Delhi CM Atishi : తన తండ్రిని అవమానించడంపై కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం
కానీ మా తండ్రిగారిని అవమానించడం సరికాదు అని అతిషి ఆవేదన వ్యక్తం చేశారు.
CM Atishi : బీజేపీ నేత రమేష్ బిధూరి తనపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి(CM Atishi) సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అతిషి ఇంటిపేరుపై బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ”రాజకీయాలు ఎందుకు ఇంతలా దిగజారిపోయాయి? ఆయన (బిధూరి) పదేళ్లుగా కల్కాజీ నియోజకవర్గానికి చేసిన పనులు ఉంటే వాటి గురించి చెప్పుకోవచ్చు. చేసిన పనుల ఆధారంగా ఓట్లు అడగొచ్చు. కానీ మా తండ్రిగారిని అవమానించడం సరికాదు” అని అతిషి(CM Atishi) ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రి తన జీవితమంతా ఒక టీచర్‌గా పనిచేశారని, పేద, మధ్యతరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు పాఠాలు చెప్పారని, ఇప్పుడు ఆయన వయస్సు 80 సంవత్సరాలని తెలిపారు. ఆయన నిజంగానే అస్వస్థతతో ఉన్నారని, ఎవరో ఒకరి సాయం లేకుండా నడవలేకపోతున్నారని చెప్పారు. ఎలక్షన్ల కోసమని తన తండ్రిపై ఆయన (బిధూరి) బురద చల్లుతారా? ఒక వృద్ధుడిపై నిందలు వేస్తారా? ఈ దేశ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతాయని తాను ఎన్నడూ అనుకోలేదని అతిషి తెలిపారు.
Delhi CM Atishi Emotional…
అతిషి ఇంటిపేరు ‘మార్లేనా’ అని.. ‘సింగ్’గా పేరు మార్చుకున్నారని రోహిణిలో జరిగిన బీజేపీ పరివర్తన ర్యాలీలో బిధూరి అన్నారు. కల్కాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అతిషి కొద్ది కాలం క్రితమే తన ఇంటిపేరును వదులుకున్నారని చెప్పారు. కల్గాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు.
Also Read : Chhattisgarh Encounter : బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..9 మంది జవాన్ల దుర్మరణం