Manish Sisodia : సిసోడియాకు బెయిల్ నిరాక‌ర‌ణ

కుద‌ర‌ద‌న్న ఢిల్లీ కోర్టు షాక్

Manish Sisodia : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైలు పాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాకు(Manish Sisodia) బిగ్ షాక్ త‌గిలింది. ఇవాళ ఆయ‌నకు బెయిల్ ఇచ్చే విష‌యంపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. సిసోడియాపై అభియోగాలు, ఆరోప‌ణ‌లు తీవ్ర‌మైన‌వ‌ని పేర్కొంది. అందుకే బెయిల్ మంజూరు చేయ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.

ఇప్ప‌టికే ద‌ర్యాప్తు సంస్థ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింద‌ని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా స‌మ‌ర్పించింద‌ని తెలిపింది కోర్టు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

ఇప్ప‌టికే మ‌రో మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ అనారోగ్యం పాలై మొన్నే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు మ‌రో మాజీకి కోలుకోలేని రీతిలో షాక్ త‌గ‌ల‌డంతో ఆప్ ఇబ్బంది ప‌డుతోంది. బెయిల్ పిటిష‌న్ పై తీర్పును ప్ర‌క‌టిస్తూ మ‌నీష్ సిసోడియా ప్ర‌భావంత‌మైన వ్య‌క్తి అని , అత‌ను బెయిల్ పై విడుద‌లైతే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశాన్ని తోసి పుచ్చలేమంటూ కోర్టు పేర్కొంది.

జ‌స్టిస్ దినేష్ కుమార్ శ‌ర్మ‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బెయిల్ పిటిష‌న్ ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పారు. బెయిల్ ను వ్య‌తిరేకిస్తూ సీబీఐ దర్యాప్తును తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ పేర్కొంది.

Also Read : Bank Holidays

 

Leave A Reply

Your Email Id will not be published!