Manish Sisodia Custody : సిసోడియాకు షాక్ కస్టడీ పొడిగింపు
నివాసం ఖాళీ చేయాలని ఆదేశం
Manish Sisodia Custody : ఢిల్లీ లిక్కర్ దందాలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన ఆప్ అగ్ర నాయకుడు, మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. మార్చి 17న శుక్రవారం మనీష్ సిసోడియా కస్టడీ(Manish Sisodia Custody) ముగియనుండడంతో ఆయనను కోర్టులు ప్రవేశ పెట్టింది ఈడీ. ఇదిలా ఉండగా మరో ఏడు రోజులు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది.
దీనికి కోర్టు ఒప్పుకోలేదు. కేవలం ఐదు రోజుల పాటు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సిసోడియా న్యాయవాది తప్పు పట్టారు. దీంతో వారం రోజులు కాకుండా ఐదు రోజులకే కుదించింది. ఇదే సమయంలో తన కుటుంబానికి సంబంధించిన నెల వారీ ఖర్చు రూ. 40 వేలు , భార్య ఆరోగ్యానికి సంబంధించి ఖర్చులకు సంబంధించి రూ. 45 వేల చెక్కులపై సంతకం చేసేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా మరో వైపు ఇంకో షాక్ తగిలింది. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాకు(Manish Sisodia) కేటాయించిన అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మార్చి 21 దాకా గడువు ఇచ్చారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కీలక పాత్ర పోషించిందని విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మనీష్ సిసోడియాకు కేటాయించిన గదిని విద్యా శాఖ మంత్రి అతిషికి కేటాయించారు.
Also Read : అఖిలేష్ దీదీ కొత్త ఫ్రంట్