Delhi LG VK Saxena : నోరు పారేసుకుంటే చర్యలు తప్పవు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎల్జీ సక్సేనా వార్నింగ్
Delhi LG VK Saxena : ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వర్సెస్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆప్ నేతలు కావాలాని తనను టార్గెట్ చేస్తున్నారని, సభ్యత మరిచి నోరు పారేసుకుంటున్నారని ఇలాగైతే తాను ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ సీఎం కేజ్రీవాల్ కు ఎల్జీ సక్సేనా(Delhi LG VK Saxena) లేఖ రాశారు. ప్రస్తుతం సక్సేనా రాసిన లేఖ కలకలం రేపుతోంది.
విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన ఫైల్ పై తాను సంతకం చేయలేదంటూ అసంబద్ద ఆరోపణలు చేశారంటూ ఆప్ మంత్రి అతిషిపై నిప్పులు చెరిగారు. మరో వైపు ఎంపీ సంజయ్ సింగ్ సైతం నోరు పారేసుకున్నారు. విషయం తెలుసుకోకుండా మాట్లాడటం ఆప్ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్జీ సక్సేనా. చట్ట పరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేదలకు విద్యుత్ సబ్సిడీని అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయం కూడా మీకు తెలుసని పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో వివిధ ఫైళ్లపై రాసినట్లుగా పబ్లిక్ డొమైన్ లో అదే స్పష్టం చేశానని తెలిపారు ఎల్జీ. రేపు క్లియర్ చేయాల్సి ఉన్న ఫైళ్లను ఇవాళే పంపిస్తే ఎలా అని మండిపడ్డారు.
Also Read : బీజేపీ మంత్రి ఆస్తులు రూ.1,609 కోట్లు