Manish Sisodia Extend : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
మే 1 దాకా జైలులోనే ఉండాల్సిందే
Manish Sisodia Extend : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. ఇదే కేసుకు సంబంధించి ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సీబీఐ ముందు హాజరయ్యారు. ఏకంగా 9 గంటల పాటు సీఎంను ప్రశ్నించింది. ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ తరుణంలో ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు(Manish Sisodia Extend) షాక్ తగిలింది. వచ్చే నెల మే 1 వరకు కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ తీర్పు సీబీఐ స్పెషల్ కోర్టు వెలువరించింది.
మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటి దాకా 34 మందిపై అభియోగాలు మోపింది. ప్రధానంగా మనీష్ సిసోడియా , సీఎం కూతురు ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతం కేజ్రీవాల్ ఇలా ఒకరి వెంట మరొకరు సీబీఐ ముందు క్యూ కడుతున్నారు. ఇంకో వైపు మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీకి సీబీఐ నోటీసులు జారీ చేసింది. పశువుల అక్రమ రవాణా కేసులో కోట్లు చేతులు మారాయంటూ కేసు నమోదైంది.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ. 100 కోట్లు లావాదేవీలు జరిగాయని పేర్కొంది సీబీఐ తన ఛార్జ్ షీట్ లో. అంతే కాదు ఎమ్మెల్సీ కవిత సెల్ ఫోన్లను ధ్వంసం చేసిందంటూ ఆరోపించింది. ఆమె ఆ ఫోన్లను కూడా ప్రదర్శించింది. ఇక తనను ప్రశ్నించకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించింది కవిత. దీనిపై ఈనెల 24న విచారించనుంది. మొత్తంగా ఎపిసోడ్ సిసోడియా..కవిత..కేజ్రీవాల్ మధ్య నడుస్తోంది.
Also Read : అదానీ మోసం మోదీ మౌనం – రాహుల్
