Delhi Liquor Case : ఈడీ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీటుపై విచారణ ముగిసినట్టేనా..
ఈడీ 8,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది....
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ సీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడో అనుబంధ చార్జిషీట్‌పై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ 8,000 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది.
Delhi Liquor Case Update
ఎమ్మెల్సీ కవిత సహా ఐదుగురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను పరిశీలించేందుకు వాదనల అనంతరం తుది తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేస్తామని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ భవేజా తెలిపారు. కాగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌పై ఈ నెల 28 నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయి.
Also Read : KA Paul : స్ట్రాంగ్ రూమ్ భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్