Delhi Liquor Scam Security : ఢిల్లీ ఈడీ వద్ద ఉద్రిక్తత భారీ భద్రత
144వ సెక్షన్ విధించిన ఢిల్లీ పోలీస్
Delhi Liquor Scam Security : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి రెండోసారి విచారణ ఎదుర్కొంటున్నారు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పటికే మార్చి 11న ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆరోజు ఉదయం 11 గంటలకు వెళ్లి రాత్రి 8.05 గంటలకు తిరిగి వచ్చింది. అనంతరం నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ
మెతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ , తదితరులు వచ్చారు. ఇక విచారణకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక పాత్రధారులుగా భావించిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ను విచారించింది. మార్చి 16న తిరిగి ఈడీ ఆఫీసు ముందు విచారణకు హాజరు కానుంది ఎమ్మెల్సీ కవిత.
ఇవాళ అరెస్ట్ కానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జన జాగృతి సంస్థకు చెందిన ప్రతినిధులతో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా ఉండేందుకు గాను ఢిల్లీ పోలీసులు గట్టి భద్రతను(Delhi Liquor Scam Security) ఏర్పాటు చేశారు.
ఈడీ ఆఫీసు వద్ద ఎవరూ ఉండ కూడదంటూ 144వ సెక్షన్ విధించింది. మరో వైపు తనకు స్టే ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణలో బుచ్చిబాబు, రామచంద్రన్ పిళ్లైతో కలిసి విచారించనున్నట్లు సమాచారం.
Also Read : తల వంచను భయపడను