Delhi: ముఖ్యమంత్రిపై దాడి నేపథ్యంలో దిల్లీ పోలీస్ కమిషనర్ మార్పు
ముఖ్యమంత్రిపై దాడి నేపథ్యంలో దిల్లీ పోలీస్ కమిషనర్ మార్పు
Delhi : దిల్లీ నూతన పోలీస్ కమిషనర్ గా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సతీశ్ గోల్చా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ శశిభూషణ్ కుమార్ సింగ్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. గోల్చా ప్రస్తుతం దిల్లీ డీజీ (జైళ్లు)గా విధులు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుందని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా… సంజయ్ అరోరా పదవీ విరమణ నేపథ్యంలో ఆగస్టు 1న దిల్లీ (Delhi) సీపీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎస్బీకే సింగ్… హోం గార్డ్స్ డీజీగా కొనసాగనున్నారు.
Delhi Commissioner Replacement
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతివారం నిర్వహిస్తున్న ‘జన్ సున్వాయ్’ కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన దుండగుడు… పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఆటో డ్రైవర్ సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్(41)గా గుర్తించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. దిల్లీలోని వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోనే తాను ఈ దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Also Read : Rahul Mamkootathil: నటి ఆరోపణలుతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
