Delhi Results 2025-Modi : ఢిల్లీలో బీజేపీ గెలుపు అనంతరం మోదీ రియాక్షన్
26 ఏళ్ల తరువాత దేశ రాజధాని బీజేపీ చేతుల్లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైపోయింది...
Delhi Results : ఢిల్లీపై ఆప్ ఆధిపత్యానికి గండికొట్టి విజయం దిశగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ దూసుకుపోతోంది. 45 పైచిలుకు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా ఆప్ మాత్రం కేవలం 21 స్థానాల్లోనే మెరుగైన స్థితిలో ఉంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మరో కీలక నేత మనీశ్ శిశోడియా బరిలోకి దిగిన న్యూఢిల్లీ, ప్రతాప్‌గంజ్ స్థానాలు కూడా బీజేపీ అకౌంట్‌లోకి చేరాయి. 26 ఏళ్ల తరువాత దేశ రాజధాని బీజేపీ చేతుల్లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైపోయింది. అయితే, బీజేపీ గెలుపు విషయం అటుంచితే 2020లో కేవలం 8 సీట్లకు పరిమితమైన కాషాయం పార్టీ కేవలం ఐదేళ్లల్లో ఆప్‌ను మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Delhi Results-PM Modi Reaction..
గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఆప్ ఏకంగా 62 స్థానాల్లో విజయఢంకా ఎగరవేసింది. దీంతో, సునాయసంగా రెండోసారి ఢిల్లీ పగ్గాలు చేపట్టింది. 1993లో ఒక పర్యాయం మినహా బిజేపీ దేశరాజధానిలో ఎప్పుడూ వెనకంజలోనే ఉంది. అప్పట్లో కమలం పార్టీ ఏకంగా 49 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 14 సీట్లకు పరిమితమైంది. కానీ 1998 తరువాత మాత్రం బీజేపీ ట్రాక్ రికార్డు సైలెంట్ అయిపోయింది. 1998 నాటి ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ మాత్రం 52 సీట్లల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక 2003 ఎన్నికల్లో బీజేపీ కొద్దిగా పుంజుకుని 20 సీట్లు దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 23కు చేరింది.
Also Read : Chiranjeevi-PM Modi : ప్రధాని మోదీతో వీడియో కాన్ఫిరెన్సు పై చిరు కీలక ట్వీట్