Delhi Teacher Dance : ఢిల్లీ టీచ‌ర్ ‘గులాటి’ డ్యాన్స్ వైర‌ల్

మ‌న‌సు దోచుకున్న మ్యాథ్స్ టీచ‌ర్

Delhi Teacher Dance : సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని సామాన్యులు క్ష‌ణాల్లో సెన్సేష‌న్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్ర‌జ‌ల్ని నెట్టిల్లు క‌ట్టి ప‌డేస్తోంది. గుండెల్ని మీటుతోంది.

ఇక పిట్ట కూత (ట్విట్ట‌ర్ ) వ‌చ్చాక క్ష‌ణాల్లోనే లోకంలో ఎక్క‌డ ఏం జ‌రిగినా తెలిసి పోతోంది. వైర‌ల్ అవుతోంది. తాజాగా అలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంది ఢిల్లీలో. పాఠాలు ఒక్కొక్క‌క‌రు ఒక్కోలా చెబుతారు.

పిల్ల‌ల్ని అర్థం చేసుకోవ‌డం. వారి మాన‌సిక స్థాయికి త‌గ్గ‌ట్టు న‌డుచు కోవ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అందుకే ఎంత ఎత్తులో ఉన్నా, ఏ స్థాయికి ఎదిగినా ముందుగా స్మ‌రించుకునేది, గుర్తుకు తెచ్చుకునేది త‌మ‌కు విద్యాబుద్దులు బోధించిన గురువులే.

తాజాగా ఢిల్లీలోని పాఠ‌శాల‌లో మ్యాథ్స్ టీచ‌ర్ గా ఉన్న గులాటి (Delhi Teacher Dance) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారారు. ఆమె పిల్ల‌ల‌కు భిన్నంగా పాఠాలు చెబుతోంది.

అది డ్యాన్సు ద్వారా. క్లాసులో ఆమె వేసిన స్టెప్పుల‌కు పిల్ల‌లు కూడా ఆనందంతో గంతులు వేయ‌డం , ఆ వీడియో నెట్టింట్లో ప్ర‌త్య‌క్షం కావ‌డం, వెంట‌నే వేలాది మంది దానిని చూసి అభినందించ‌డం, షేర్ చేయ‌డం జ‌రిగింది.

ప్ర‌స్తుతం గులాటీ డ్యాన్స్ వీడియో(Delhi Teacher Dance) హ‌ల్ చ‌ల్ చేస్తోంది. గులాటీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్ గా ప‌ని చేస్తున్నారు. ఆమె ఎల్లప్పుడూ ఉద్వేగ భ‌రితంగా, ఉల్లాస‌వంతంగా ఉంటారు.

అంతే కాదు గులాటి మంచి విద్యాధికురాలు. ఫుల్ బ్రైట్ ఫెలో, పీహెచ్ డి స్కాల‌ర్ కూడా. స‌మ్మ‌ర్ క్యాంప్ చివ‌రి రోజు ఢిల్లీ స్కూల్ టీచ‌ర్ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది.

దేశంలో ఎవ‌ర్ గ్రీన్ సాంగ్ గా నిలిచి పోయిన క‌జ్రా మొహ‌బ్బ‌త్ వాలా కు డ్యాన్స్ చేస్తూ..పిల్ల‌ల‌తో చేయించింది గులాటి.

Also Read : క‌రాచీ రెస్టారెంట్ లో ‘గంగూబాయి సీన్’

Leave A Reply

Your Email Id will not be published!