Delhi Vijayawada New Flight Service: విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు !
విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్త విమాన సర్వీసు !
Delhi Vijayawada: కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడకు విమాన సర్వీలను పెంచేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా విజయవాడ నుంచి ఢిల్లీ(Delhi)కి కొత్తగా మరో విమాన సర్వీసు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయవాడ(Vijayawada) – ఢిల్లీ కొత్త విమాన సర్వీసు వివరాలను తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Delhi Vijayawada Flight Service..
ఈ విమాన సేవలు వచ్చే నెల అంటే సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త సర్వీసు నడిపేందుకు ఇండిగో సంస్థ అంగీకరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘విజయవాడలో ఉదయం 11.10 గంటలకు విమానం బయలుదేరి.. మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీ చేరుతుంది. అలాగే ఢిల్లీ నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరి.. విజయవాడకు 10.40 గంటలకు చేరుకుంటుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే విమాన సర్వీసు వల్ల రాజధాని అమరావతి, ఢిల్లీ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి’’ అని పేర్కొన్నారు. సుమారు 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌బస్ ఎ320 విమానంను నడుపుతున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ మార్గంలో ఎయిరిండియా రెండు విమాన సర్వీస్‌లను నడుపుతోంది. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇండిగో సంస్థ ఢిల్లీ–విజయవాడ మధ్య సర్వీస్ నడిపేందుకు ముందుకొచ్చినట్టు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
నేటి నుంచి ముంబై–విజయవాడకు ఇండిగో సర్వీస్
వాణిజ్య రాజధాని ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇండిగో విమాన సంస్థ శుక్రవారం నుంచి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ రోజూ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు ముంబై చేరుకుంటుందని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి.
ఈ సర్వీస్ వల్ల ముంబైతో పాటు గల్ఫ్, యూరప్, ఆఫ్రికా దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సులువైన కనెక్టివిటీ సదుపాయం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ముంబై–విజయవాడ మధ్య ఎయిరిండియా సర్వీస్ నడుస్తుండగా, ఇప్పుడు ఇండిగో రాకతో మరో సర్వీస్ అందుబాటులోకొచ్చినట్లయిందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.
Also Read : Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !